BREAKING
ADD
  • Enter Slide Title Here

    Curabitur ut dui lacus. Pellentesque habitant morbi tristique senectus et netus et malesuada. Curabitur ut dui lacus. Pellentesque habitant morbi tristique senectus et netus et malesuada.

  • Enter Slide Title Here

    Curabitur ut dui lacus. Pellentesque habitant morbi tristique senectus et netus et malesuada.

  • Enter Slide Title Here

    Curabitur ut dui lacus. Pellentesque habitant morbi tristique senectus et netus et malesuada. Curabitur ut dui lacus. Pellentesque habitant morbi tristique senectus et netus et malesuada.

  • Enter Slide Title Here

    Curabitur ut dui lacus. Pellentesque habitant morbi tristique senectus et netus et malesuada.

Monday 30 May 2016

ప్రియమణి జీవితంలొ... ఒక యువరాజు


ప్రియమణి జీవితంలొ... ఒక యువరాజు

సౌత్ లో ఎందరో అభిమానులని సంపాదించిన ప్రియమని నిశ్చితార్ధం బెంగళూరులోని ఆమె ఇంటిలొ జరిగింది. చెన్నైకి చెందిన వ్యాపారవేత్త ముస్తఫారాజ్ తో చాలా కాలంగా ఆమె ప్రేమలొ ఉన్న సంగతి తెలిసిందే. శుక్రవారం తమ నిశ్చితార్ధం జరిగిన విషయాన్ని ప్రియమని ట్విట్టర్ ద్వార చెప్పింది..

AD


మరింత సమాచారం కోసం
LIKE, SHARE, FOLLOW, SUBSCRIBE us

FACEBOOK                                                    TWITTER                                              YOUTUBE           

హైదరబాద్ బిర్యాని అదుర్స్...

హైదరబాద్ బిర్యాని అదుర్స్...

ఐపిఎల్ 2016 విజేతగా సన్‌రైజర్స్ హైదరాబాద్ అవతరించింది. 8 పరుగుల తేడాతో బెంగుళూరు జట్టును ఓడించింది. 209 పరుగుల టార్గెట్‌ను ఛేదించకుండా బెంగుళూరు జట్టును కట్టడి చేసింది. 6 బంతుల్లో 18 పరుగులు చేయాల్సి ఉండగా ఆఖరి ఓవర్ వేశాడు భువనేశ్వర్. కెప్టెన్ వార్నర్ భూవీతో పలుమార్లు మంతనాలు జరిపాడు. అద్భుతంగా బౌలింగ్ చేసిన భువనేశ్వర్ బెంగుళూరు టెయిలెండర్స్‌ను కట్టడి చేయగలిగాడు. 20వ ఓవర్ మూడో బంతికి భూవీ వేసిన చక్కని బంతిని కీపర్ అందుకుని రనౌట్ చేశాడు. ఆ సమయానికి 3 బంతుల్లో 15 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఉంది. దీంతో ఒత్తిడిలో ఉన్న బెంగళూరు ఆటగాళ్లు చేతెలెత్తేశారు. ఐపిఎల్ చరిత్రలో మొదటిసారిగా కప్‌ను అందుకుంది సన్‌రైజర్స్ టీం.

జట్టు స్కోర్లు : సన్‌రైజర్స్ హైదరాబాద్ 208/7(20 ఓవర్లలో), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 200/7 (20 ఓవర్లలో)

హైదరాబాద్ బ్యాటింగ్ : వార్నర్ 69, బెన్ కటింగ్ 39, యువరాజ్ 38, ధావన్ 28

బెంగళూరు బ్యాటింగ్ : గేల్ 76, కోహ్లీ 54, డెవిలియర్స్ 5, వాట్సన్ 11, సచిన్ బాబీ 18.

AD


మరింత సమాచారం కోసం
LIKE, SHARE, FOLLOW, SUBSCRIBE us

FACEBOOK                                                    TWITTER                                              YOUTUBE                     




Friday 20 May 2016

బ్రహ్మోత్సవం సినిమా రివ్యు || Brahmotsavam movie review




బ్రహ్మోత్సవం సినిమా రివ్యు 

TOLLY BEATS Rating: 2.75/5

బ్రహ్మోత్సవం’... సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటించిన ఈ సినిమా కొద్దికాలంగా సగటు తెలుగు సినీ ప్రేక్షకుడిని ఎంతగానో ఎదురుచూయిస్తూ వస్తోన్న సినిమాల్లో మొదటి స్థానంలో ఉన్న సినిమా. మహేష్‍తో కలిసి గతంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి అందమైన సినిమాను మనకు అందించిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని భారీ అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఆ అంచనాలను అందుకునే స్థాయిలోనే ఈ ‘బ్రహ్మోత్సవం’ ఉందా? చూద్దాం...

కథ :
విజయవాడలో ఓ ప్రముఖ వ్యాపారవేత్త అయిన చంటబ్బాయి (సత్యరాజ్‌)ది అందరూ కలిసి ఉండాలని కోరుకునే మనస్థత్వం. అతడి చెల్లెళ్ళు, వాళ్ళ కుటుంబాలు, అంతా కలిసి ఉత్సవంలా ఒకచోట ఉండి జీవితాలను గడుపుతుంటారు. చంటబ్బాయి లాంటి ఆలోచనలున్న వ్యక్తే అతడి కుమారుడు మహేష్ బాబు. ఏదీ పెద్దగా ఆలోచించకుండానే చేసేసే మనస్థత్వం ఉన్న మహేష్, ఎవ్వరితోనైనా ఇట్టే కలిసిపోయి సరదాగా ఉంటూ, తండ్రి వ్యాపారాలు చూసుకుంటూ బతికేస్తుంటాడు. అంతా బాగుందనుకునే సమయంలోనే, ఆ ఇంట్లో వ్యక్తే అయిన రావు రమేష్ వల్ల ఓ గొడవ జరుగుతుంది.

ఆ గొడవ తర్వాత చంటబ్బాయి చనిపోవడంతో, ఇంట్లో పరిస్థితులన్నీ మారిపోతాయి. ఇలా మారిపోయిన పరిస్థితుల నుంచి, బంధాలంటే ఏంటో, తానేంటో తెలుసుకోవాలనే ప్రయత్నంలో మహేష్, సమంతతో కలిసి ఓ ప్రయాణం మొదలుపెడతాడు. ఆ ప్రయాణం ఏంటి? సమంత ఎవరు? ఈ ప్రయాణంలో మహేష్ ఏమేం తెలుసుకున్నాడూ? చివరకు తన ఇంట్లో పరిస్థితులను మార్చేందుకు అతడికి ఆ ప్రయాణం ఎలా ఉపయోగపడిందీ? కాశి (కాజల్)‍తో అతడి తొలిప్రేమ కథేంటీ? లాంటి ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.

ప్లస్ పాయింట్స్ :
మహేష్ లాంటి సూపర్ స్టార్‌తో, కమర్షియల్ సినిమా హంగులను ఏమాత్రం పట్టించుకోకుండా, ఓ కథ చెప్పాలన్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల సాహసాన్నే ఈ సినిమాకు అన్నింటికీ మించిన ప్రధానమైన అనుకూలాంశంగా చెప్పుకోవాలి. నలుగురికి మంచి పంచుతూ, అందరితో కలిసిమెలిసి ఉండడమనే ప్రధానాంశాన్ని సినిమా కథలో అంతర్లీనంగా చెప్పిన విధానం గురించి ఎంత చెప్పినా తక్కువే! ఇక మానవ సంబంధాలను, ఉమ్మడి కుటుంబంలోని ఆలోచనా విధానాలు, భావోద్వేగాలను శ్రీకాంత్ అడ్డాల తనదైన ముద్ర కనిపించేలా చెప్పిన విధానం కూడా చాలా బాగుంది.

ఇక సూపర్ స్టార్ మహేష్ ఎప్పట్లానే ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలబడి, సినిమాను తన చరిష్మాతో ముందుకు నడిపించాడు. ఇలాంటి ఒక కథను తన స్టార్ స్టేటస్ గురించి ఆలోచించకుండా, నిజాయితీగా కథకే కట్టుబడి ఉంటూ చేయడమనేది మహేష్ ఈ సినిమా విషయంలో సాధించిన పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు. నటనలో మహేష్‌ స్థాయి ఏంటన్నది ఇప్పటికే చాలా సినిమాలు ఋజువుచేయగా, బ్రహ్మోత్సవం కూడా ఇదే అంశాన్ని మరోసారి బలంగా ఋజువుచేస్తూ, ఆయన స్థాయి మరింత ఎత్తుకు తీసుకెళ్ళింది. ఇక సమంత తన పాత్రలో ఒదిగిపోయి నటించింది. మహేష్-సమంతల కాంబినేషన్‌లో వచ్చే జర్నీ బాగుంది. ఇక కాజల్‍ ఈ సినిమాలో తాను ఇంతకుముందెప్పుడూ చేయని తరహా పాత్రలో చూపిన ప్రతిభ చాలా బాగుంది. మహేష్-కాజల్‌ల ప్రేమకథ కూడా సహజంగా ఉంది. ఇక ప్రణీతది చిన్న పాత్రైనా బాగా చేసింది. రావు రమేష్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. కథను బలంగా ప్రభావితం చేసే పాత్రలో ఆయన నటన కట్టిపడేసేలా ఉంది. సత్యరాజ్ ఓ బలమైన పాత్రలో సినిమాకు నిండుతన తెచ్చారు. ఇక రేవతి, జయసుధ, నరేష్, తులసి, వెన్నెల కిషోర్, తనికెళ్ళ భరణి.. ఇలా సినిమాలో కీలక పాత్రల్లో నటించిన వారంతా తమ నటనతో ఆకట్టుకుంటారు.

సినిమా పరంగా చూసుకుంటే… అసలు కథను పరిచయం చేయడం, మహేష్-సమంతల జర్నీ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు, కుటుంబమంతా కలిసి ఓ పండగలా జీవితాల్ని ఆస్వాధించడం, అదిరిపోయే ఇంటర్వెల్ బ్యాంగ్, మహేష్-కాజల్‍ల రొమాన్స్, క్లైమాక్స్ లాంటివి ప్రధాన అనుకూలాంశాలుగా చెప్పుకోవచ్చు.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు ప్రధానమైన ప్రతికూలాంశం అంటే, కథ వేగం చాలా నెమ్మదిగా ఉండడమని చెప్పుకోవాలి. సెకండాఫ్‌లో మహేష్-సమంతల జర్నీ బాగున్నా, దానికి ముందొచ్చే సన్నివేశాలేవీ అంత బలంగా లేకపోవడంతో, ఈ జర్నీ లాజిక్ లేని విషయంగా కనిపిస్తుంది. ఇక కొన్ని సన్నివేశాలు తిరిగి తిరిగి అక్కడికే వస్తున్నాయన్నట్లుగా సెకండాఫ్‌లో ఈ ఎపిసోడ్ సాగుతూంటుంది. ఇక సాధారణంగా కమర్షియల్ సినిమాల్లో కోరుకునే అంశాలేవీ లేని సినిమా కావడం కూడా అలాంటి అంశాలను కోరేవారికి నచ్చకపోవచ్చని విషయంగా చెప్పుకోవచ్చు. సమంత కథలోకి ఎంట్రీ ఇచ్చిన విధానం కూడా పెద్దగా ఆకట్టుకోదు. ఇక కొన్నిచోట్ల విజువల్ ఎఫెక్ట్స్ కూడా సినిమా స్థాయికి తగ్గట్టుగా లేవు.



సాంకేతిక విభాగం :
సాంకేతిక అంశాల పరంగా చూస్తే, ‘బ్రహ్మోత్సవం’ అన్నివిధాలా బాగుందనే చెప్పుకోవచ్చు. శ్రీకాంత్ అడ్డాల రచనలో ఎంత లోతుందో, తాను చెప్పాలనుకున్న అంశాలను కథగా తెలివిగా చెప్పించిన విధానం చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. చిన్నదే అయినా, బలమైనది కూడా అయిన ఒక అంశం చుట్టూ కథ చెప్పాలనుకోవడం, దాన్ని కథగా చెప్పడానికి ఏమేం కావాలో వాటన్నింటితో ఓ మంచి స్క్రీన్‌ప్లే రాసుకోవడం లాంటి విషయాల్లో శ్రీకాంత్ అడ్డాల ప్రతిభను చూడొచ్చు. డైలాగ్స్ పరంగానూ శ్రీకాంత్ మరోసారి తన స్థాయిని చాటుకున్నాడు. దర్శకుడిగా ప్రతి దర్శకుడూ ఒక బ్రాండ్ కోరుకుంటాడు. శ్రీకాంత్ రెండో సినిమాతోనే దాన్ని సాధించి, ‘బ్రహ్మోత్సవం’ దగ్గరకొచ్చేసరికి ఆ బ్రాండ్‌ని అలాగే నిలబెట్టుకున్నాడు.

ఇక రత్నవేలు సినిమాటోగ్రఫీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే! సాధారణంగా తెలుగు సినిమాల్లో కనిపించని, బాలీవుడ్‌కు మాత్రమే సాధ్యమనుకున్న ఓ ఫ్లేవర్‍ను సెకండాఫ్‌లో చూడొచ్చు. అది రత్నవేలు ప్రతిభ వల్లే అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మిక్కీ జే మేయర్ సమకూర్చిన పాటలు ఇప్పటికే అంతటా సూపర్ హిట్ అనిపించుకోగా, సినిమాలో, ఆయా సందర్భాల్లో వచ్చే ఈ పాటలు బాగున్నాయి. గోపీ సుందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, రీ రికార్డింగ్‍ సినిమా స్థాయికి తగ్గట్టే బాగున్నాయి. కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటింగ్ బాగుంది. ఇలాంటి సినిమాలకు కావాల్సిన మూడ్‌ను ఎడిటింగ్ ద్వారా ఆయన బాగానే క్యారీ చేశారు. తోట తరణి ఆర్ట్ వర్క్ గురించి కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. ఆయన స్థాయి ఎంతటిదో ఈ సినిమా మరోసారి ఋజువు చేసింది. పీవీపీ సినిమా నిర్మాణ విలువలను ప్రశంసించకుండా ఉండలేం.

తీర్పు :
అందరూ కలిసి, ఒకరికొకరు అండగా నిలబడడమే ఎవ్వరి జీవితంలోనైనా అతి పెద్ద ఉత్సవం అని చెప్పే సినిమాయే ‘బ్రహ్మోత్సవం’. ఈ విషయాన్ని తెలుసుకునేందుకే, ఎవ్వరిని పలకరించడానికైనా పెద్దగా ఆలోచించక్కర్లేదనే కథానాయకుడు చేసే ప్రయాణమే మేజర్ హైలైట్. ఆ కథానాయకుడి పాత్రలో నటించిన మహేష్ సినిమాను తన చరిష్మాతో ముందుండి నడిపించడంలో సఫలమయ్యాడు. శ్రీకాంత్ అడ్డాల కథగా చెప్పాలనుకున్న ఆలోచన, కట్టిపడేసే కొన్ని భావోద్వేగాలు, ప్రయాణాలు ఇవన్నీ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్‌. ఇకపోతే కథ చాలా నెమ్మదిగా సాగడం, సెకండాఫ్‌లో కొన్ని లాజిక్‍కి సంబంధం లేని అంశాలు లాంటివి మైనస్ పాయింట్స్‌గా చెప్పుకోవాలి. ఒక్కమాటలో చెప్పాలంటే.. మూలాల్ని వెతికే ప్రయాణంలో బంధాల్ని అర్థం చేసుకోవచ్చని, ఆ బంధాలు అలా సాగడమే ‘బ్రహ్మోత్సవం’ అని చెప్పే ఆలోచనకు కనెక్ట్ అయితే, ఈ సినిమా బాగా ఆకట్టుకుంటుందనే చెప్పొచ్చు.





మరింత సమాచారం కోసం
LIKE, FOLLOW & SUBSCRIBE us

Facebook          Twitter          YouTube          Blog          Google+

Thursday 19 May 2016

మూడు రాష్ట్రాలు, రెండు దేశాలలో బీబత్సం సృష్టిస్తున్న బుడ్డోడు...!!!



మూడు రాష్ట్రాలు, రెండు దేశాలలో బీబత్సం సృష్టిస్తున్న బుడ్డోడు...!!!

                              టెంపర్, నాన్నకు ప్రేమతో సినిమాలతో వైవిద్యం చూపిస్తూ జోరు మీద ఉన్న బుడ్డోడు ఇప్పుడు పూర్తి మాస్ మసలా సినిమాతొ అభిమానులని అలరించడానికి సిద్దం అవ్తున్నాడు. మీసాలు రాకమునుపే తెలుగు సినీ పరిస్రమలో మాస్ హీరోగా ఎవరు అందుకొలేని స్థాయికి ఎదిగిన యంగ్ టైగర్ ఎన్.టి.ర్., రజనీకాంత్ ని సైతం ఆశ్చర్య పరిచాడు మన బుడ్డోడు. తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా, కర్ణాటకా, కేరలతో పాటు, రజనీకాంత్ తరువాత జపాన్ లో అంతటి క్రేజ్ ఉన్న నటుడు మన బుడ్డోడు.
                                


మిర్చి, శ్రీమంతుడు లాంటి వరుస విజయాలతొ ఉన్న కొరటాల శివ, ఎన్.టి.ర్. తో తీస్తున్న "జనతా గేరేజ్" చిత్రం 1లుక్ ని తారక్ పుట్టిన రోజు సందర్బంగా విడుదల చేసారు. తారాక్ పొస్టర్లు చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.




                                                                                                                                      --రవి కిరణ్ మాదినీడి
మరింత సమాచారం కోసం
LIKE, FOLLOW & SUBSCRIBE us


Facebook          Twitter          YouTube          Blog          Google+

ఎన్.టి.ర్. గురించి నాకన్న బాగా ఎవ్వరు చెప్పలేరు...!!

ఎన్.టి.ర్. గురించి నాకన్న బాగా ఎవ్వరు చెప్పలేరు...!!



                                                                                                                                         --రవి కిరణ్ మాదినీడి
మరింత సమాచారం కోసం
LIKE, FOLLOW & SUBSCRIBE us

Monday 16 May 2016

పవన్ అభిమానులు మీద సేటైర్ వేసిన తమ్మారెడ్డి..!!!


పవన్ అభిమానులు మీద సేటైర్ వేసిన తమ్మారెడ్డి..!!!



                                                                                                                                         --రవి కిరణ్ మాదినీడి
మరింత సమాచారం కోసం
LIKE, FOLLOW & SUBSCRIBE us


Facebook          Twitter          YouTube          Blog          Google+

Friday 6 May 2016

సూర్య "24" సినిమా రివ్యు || Surya "24" movie Review


సూర్య "24" సినిమా రివ్యు 


TOLLY BEATS RATING: 4.75/5 ( This decade highest rating)

13 బీ’, ‘ఇష్క్’, ‘మనం’ చిత్రాలతో దర్శకుడిగా తనదంటూ ఓ బ్రాండ్ సెట్ చేసుకున్న దర్శకుడు విక్రమ్ కుమార్, తమిళ సూపర్ స్టార్ సూర్యతో కలిసి ’24’ అనే సైన్స్ ఫిక్షన్ కథతో మనముందుకు వచ్చారు. సూర్య తన సొంత బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మరి సినిమా ఆ అంచనాలను అందుకుందా? చూద్దాం..

కథ :

శివ కుమార్ (సూర్య) ఓ సైంటిస్ట్. తన భార్య ప్రియ (నిత్యా మీనన్), నెలల వయసుండే కొడుకుతో కలిసి ఓ ప్రశాంతమైన పరిసరాల్లో జీవిస్తూ, ఓ వాచీని కనిపెట్టే ప్రయత్నాల్లో ఉంటాడు. ఆ వాచీతో కాలంలో ముందుకు, వెనక్కి వెళ్ళే అవకాశం ఉండడమే దాని ప్రత్యేకత. అలాంటి వాచీని తన సొంతం చేసుకోవాలని శివకు కవల సోదరుడైన ఆత్రేయ (సూర్య) ప్రయత్నిస్తూంటాడు. అలాంటి ప్రయత్నాల్లోనే కొన్ని అనూహ్య పరిస్థితుల్లో, శివ, ప్రియ ప్రాణాలు కోల్పోవడమే కాకుండా ఆ వాచీని, తమ కుమారుడిని ఎవరో తెలియని ఓ యువతి (శరణ్య) చెంత చేరుస్తారు.
26 ఏళ్ల తరువాత, తల్లి శరణ్యతో సంతోష జీవితం గడిపే మణి (సూర్య)కు తమ వద్ద ఉండే ఆ వాచీ గురించి తెలుస్తుంది. మణికి ఈ వాచీ దొరికిందన్న విషయం కూడా అప్పుడే 26ఏళ్ళు కోమాలో ఉండి బయటకొచ్చిన ఆత్రేయకు కూడా తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ వాచీ ఎలా పనిచేస్తుంది? మణి దగ్గర వాచీ ఉందని తెలుసుకున్న ఆత్రేయ అతడ్ని ఏం చేశాడు? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానమే మిగతా కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు ప్రధానమైన అనుకూలాంశం అంటే కథా ఆలోచన దగ్గర్నుంచి, చూస్తున్న ప్రతీ సన్నివేశం కట్టిపడేసేంత కొత్తదనంతో ఓ మాయలా ఉండడం గురించి చెప్పుకోవాలి. కాలంలో ముందుకు, వెనక్కి వెళ్ళడం అనే ఆలోచన తెలుగు సినిమాకు కొత్తది కాకపోయినా, ఈ సినిమాలో ఆ అంశం పక్కనబెడితే మిగతాదంతా చాలా కొత్తది. ఇలాంటి ఒక ప్రయత్నాన్ని ఇండియన్ సినిమా పరిస్థితులకు తగ్గట్టు చెప్పడం దర్శకుడిగా విక్రమ్ కుమార్ ఈ సినిమాలో చూపిన అద్భుతమైన ప్రతిభగా చెప్పుకోవాలి. ప్రతీ పావుగంటకు ఒక ట్విస్ట్, ప్రతీ సన్నివేశంలో కొత్త కొత్త ఆలోచనలు, పరిస్థితులు కల్పిస్తూ కథను ముందుకు నడిపే విధానం కట్టిపడేసేలా ఉంది.

ఇక ఈ సినిమాలో మూడు పాత్రలు చేసిన సూర్య సినిమానంతా తన ఈజ్‌తో మరింత ఉత్సాహంతో నడిపించాడు. శివ, ఆత్రేయ, మణి.. ఇలా ప్రతి పాత్రలోనూ సూర్య చూపిన నేర్పు, ఆయన నటనా స్థాయిని మరోసారి బలంగా పరిచయం చేసింది. నిత్యా మీనన్ ఉన్న కొద్దిసేపైనా చాలా బాగా నటించింది. సమంత తనకు అలవాటైన పాత్రలో బాగా నటించింది. చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్స్ కూడా సరిగ్గా పలికించడంలో సమంత ప్రతిభను ఈ సినిమాలో మరోసారి చూడొచ్చు. శరణ్య తన నటనతో ఆ పాత్ర స్థాయిని మరింత పెంచారు. ఇక ఆత్రేయ వెన్నంటి ఉండే మిత్ర అనే పాత్రలో అజయ్ నటన చాలా బాగుంది.

సినిమా పరంగా చూసుకుంటే, ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ట్విస్ట్.. ఇలా పతాక సమయాలన్నింటిలో సినిమా కట్టిపడేసేలానే ఉందని చెప్పొచ్చు.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మైనస్ పాయింట్స్ అంటే మొదటగా పాటల గురించే చెప్పుకోవాలి. రహమాన్ అందించిన పాటలు, వాటి చిత్రీకరణా రెండూ బాగున్నా కూడా కథా గమనంలో ఆ పాటలు రావడం బాగోలేదు. అదేవిధంగా ఫస్టాఫ్‌లో వాచీ పనిచేసే అంశాన్ని ఎక్కువసార్లు చూపించినట్లు అనిపించింది. ఇక కాలంలో ముందుకు, వెనక్కి వెళ్ళడం సాధ్యమా? ఈ ఆలోచన చుట్టూ పరిస్థితులు ఎలా మారిపోతాయి? ఇలాంటి ప్రశ్నలేవీ లేకుండా ఈ సినిమాను చూడలేని వారికి సినిమా నచ్చకపోవచ్చు.

సాంకేతిక విభాగం :
సాంకేతిక అంశాల పరంగా చూస్తే, ఈ సినిమా అన్నివిధాలా ది బెస్ట్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా దర్శకుడు విక్రమ్ కుమార్ ప్రతిభ గురించి ఇక్కడ ఎంత మాట్లాడుకున్నా తక్కువే! ఇలాంటి కథా ఆలోచనను సినిమాగా తీయాలనుకోవడం, ఆ కథా ఆలోచనను ఇండియన్ సినిమా పరిస్థితులకు తగ్గట్టుగా మార్చుకుంటూ ఓ బలమైన స్క్రీన్‌ప్లే రాసుకోవడం, ఆ స్క్రీన్‌ప్లేతో టెక్నికల్‌గానూ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా, అన్ని రకాల ఆలోచనలున్న ప్రేక్షకులకు అర్థమయ్యేలా సినిమా తీయడం.. ఇలా దర్శకుడిగా, రచయితగా ఈ సినిమాను విక్రమ్ కుమార్ మ్యాజిక్‌గా చెప్పుకోవచ్చు. తన సినిమాకు ముందే ఒక బ్రాండ్‌ను సెట్ చేసుకున్న విక్రమ్ కుమార్, ఈ సినిమాతో దాని స్థాయిని మరింత పెంచుకున్నాడు.

సినిమాటోగ్రాఫర్ తిరు పనితనం టెక్నికల్‌గా సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్ళింది. ముఖ్యంగా కథ హార్సిలి వ్యాలీ నేపథ్యంలో నడిచేప్పుడు తిరు ప్రతిభను మెచ్చుకోకుండా ఉండలేం. ఏ.ఆర్.రహమాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‍కు ఎక్కడా వంక పెట్టలేం. ‘ప్రేమ పరిచయమే’, ‘కాలం నా ప్రేయసివే’, ‘లాలిజో’ పాటలు వినడానికి బాగున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ కూడా కథా పరిధి మేరకే ఉంటూ కట్టిపడేసేంత అద్భుతంగా ఉన్నాయి. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ చాలా బాగుంది. ఎడిటింగ్ ఎఫెక్ట్స్‌తో కూడా సినిమాకు మంచి ఫీల్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. తన సొంత బ్యానర్‍లో సినిమా అంటే అది ఏ స్థాయిలో ఉంటుందో, సూర్య, నిర్మాణ విలువలతో పరిచయం చేశాడు.

తీర్పు :


కొత్తదనమున్న ఆలోచనకు, సినిమాకు ఏ భాషా సినీ పరిశ్రమలో అయినా ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. అయితే ఆ ఆలోచనను ఓ కథగా, పూర్తి స్థాయి సినిమాగా, అప్పటి పరిస్థితులకు, ప్రేక్షకుడి ఆలోచనకు ఎలా కలుపుతుమాన్నదే ఇక్కడ ప్రధానాంశం. ’24’.. ఈ ప్రధానాంశాన్ని బాగా ఒడిసిపట్టుకొని, ఓ కొత్త ఆలోచనతో వచ్చిన కొత్తదనమున్న సినిమా. కథా ఆలోచనలో, కథనంలో, దర్శకత్వ అంశాల్లో. ఇలా అన్ని విషయాల్లో దర్శకుడు విక్రమ్ కుమార్ చూపిన అద్భుతమైన ప్రతిభే ఈ సినిమాకు ప్రధానమైన అనుకూలాంశం. ఇక దానికి సూర్య నటనా చాతుర్యం కలిసి సినిమాను మరో స్థాయికి తీసుకెళ్ళాయి. ఒక్క సందర్భం లేకున్నా వచ్చే పాటలు, కొద్దిగా సాగదీసిన రొమాంటిక్ ట్రాక్ తప్ప ఈ సినిమాకు ప్రతికూలాంశాలు పెద్దగా లేవు. చివరిమాటగా చెప్పాలంటే.. సినిమా అయిపోయి బయటకొచ్చాక, కొన్ని ప్రశ్నలను, వాటి వెంటే సమాధానాలనూ మోసుకొచ్చే సినిమాలు అరుదుగా వస్తాయి. ’24’.. అలాంటి అరుదైన ప్రయోగాత్మక సినిమాల్లో ఒకటి.

---రివ్యూ బై విజ్ఞాన్ దాసరి
మరింత సమాచారం కోసం
LIKE, FOLLOW & SUBSCRIBE us


Facebook          Twitter          YouTube          Blog          Google+
 
Copyright © 2013 26PICTURES తెలుగు
Design by FBTemplates | BTT
    Twitter Facebook Google Plus Vimeo YouTube