BREAKING
ADD
  • Enter Slide Title Here

    Curabitur ut dui lacus. Pellentesque habitant morbi tristique senectus et netus et malesuada. Curabitur ut dui lacus. Pellentesque habitant morbi tristique senectus et netus et malesuada.

  • Enter Slide Title Here

    Curabitur ut dui lacus. Pellentesque habitant morbi tristique senectus et netus et malesuada.

  • Enter Slide Title Here

    Curabitur ut dui lacus. Pellentesque habitant morbi tristique senectus et netus et malesuada. Curabitur ut dui lacus. Pellentesque habitant morbi tristique senectus et netus et malesuada.

  • Enter Slide Title Here

    Curabitur ut dui lacus. Pellentesque habitant morbi tristique senectus et netus et malesuada.

Adventure

Fantasy

Romance

Top Social Icons

Latest Post

Tuesday 28 June 2016

CM KCR కొత్త పథకం


CM KCR కొత్త పథకం


తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన బిడ్డల కోసం ఒక కొత్త పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. తెలంగాణ శిశు ఆధార్ పేరుతో రూపొందించిన ఈ కొత్త పథకం ద్వారా పుట్టిన ప్రతిబిడ్డకు 20 నిమిషాల్లోనే ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. జనన ధ్రువీకరణ పత్రం ఇచ్చే అధికారాన్ని ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్ కే కల్పించనున్నారు. ఈ పథకాన్ని హైదరాబాద్ లోని నయాపూల్ ప్రసూతి ఆసుపత్రిలో ప్రయోగాత్మకంగా వారం రోజులు అమలు చేస్తారు. జులై 15 నాటికి పేట్ల బురుజు, కోఠి ఆసుపత్రి, నిలోఫర్, గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో అమలు కానుంది. జీహెచ్ ఎంసీ, తెలంగాణ ఐటీ శాఖ, ఆధార్ ప్రాంతీయ కార్యాలయం సంయుక్త నిర్వహణలో ఈ ప్రాజెక్టును అమలు చేస్తారు. దశలవారీగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు సమాచారం

ADD:


మరింత సమాచారం కోసం
LIKE, FOLLOW & SUBSCRIBE us
 
YOUTUBE                                FACEBOOK                        GOOGLE+                      TWITTER

Friday 10 June 2016

ఒక్క అమ్మాయి తప్ప సినిమా రివ్యు || Oka Ammai Thappa Movie Review

ఒక్క అమ్మాయి తప్ప సినిమా రివ్యు

Rating: 2.75/5

అంజిరెడ్డి ప్రొడక్షన్స్ పతాకంపై భోగాది అంజిరెడ్డి నిర్మాతగా రాజసింహ తాడినాడని దర్శకుడిగా పరిచయం చేస్తూ చేసిన రొమాంటిక్ థ్రిల్లర్ ’ఒక్క అమ్మాయి తప్ప’. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ సినిమాలో నిత్యామీనన్ హీరోయిన్‌గా నటించింది. ట్రాఫిక్ జామ్ నేపథ్యంలో, ఓ ఫ్లై ఓవర్‌పై నడిచే కథ కావడంతో ’ఒక్క అమ్మాయి తప్ప’పై మొదట్నుంచీ మంచి అంచనాలు ఉన్నాయి. మరి సినిమా ఆ అంచనాలను అందుకునేలానే ఉందా? చూద్దాం...

కథ :

జైల్లో ఉన్న టెర్రరిస్ట్ అస్లాం (రాహుల్ దేవ్)ని విడిపించడానికి ఓ టెర్రరిస్ట్ గ్రూప్ హెడ్ అయిన అన్వర్ (రవికిషన్) హైదరాబాద్ లో ఉన్న హైటెక్ సిటీ ఫ్లై ఓవర్ పై ట్రాఫిక్ జామ్ క్రియేట్ చేసి ఫ్లై ఓవర్ ని బాంబులతో పేల్చివేస్తామని ప్రభుత్వాన్ని బెదిరించాలని ప్లాన్ చేస్తాడు. ఇది ఇలా ఉండగా రమ్మీ ఆడటంలో ఎక్స్పర్ట్ అయిన కృష్ణ వచన్ (సందీప్ కిషన్) అనుకోకుండా హైటెక్ సిటీ ఫ్లై ఓవర్ పై ట్రాఫిక్ జామ్ లో మ్యాంగో (నిత్యామీనన్) ని కలుస్తాడు. తనే తన చిన్నప్పటి స్నేహితురాలు మ్యాంగో అని తెలుసుకుంటాడు. ఫ్లై ఓవర్‌పై ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్న హీరోకి ఓ అగంతకుడి దగ్గర నుంచి ఓ ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ ఎవరు చేశారు? ఎందుకు చేశారు? హీరోకి, ఈ టెర్రరిస్ట్ గ్రూప్ కి సంబంధం ఏంటి? టెర్రరిస్ట్ అస్లాం జైలు నుంచి విడుదల అయ్యాడా? అసలు చివరికి ఏం జరిగింది? అన్నది మిగతా కథ

ప్లస్ పాయింట్స్ :

సందీప్ కిషన్ నటన ఈ సినిమాకి ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. రొమాంటిక్ సన్నివేశాలతో పాటు సీరియస్ సన్నివేశాల్లో కూడా సందీప్ నటన ఆకట్టుకుంటుంది. మంచి ప్రతిభ గల నటిగా పేరుతెచ్చుకున్న నిత్యామీనన్ మ్యాంగో పాత్రలో ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్‌గా నిలిచింది. నిత్యామీనన్ ది చెప్పుకోదగిన పాత్ర కాకపోయినా, తన నటనతో ఆకట్టుకుంది.

స్నేహం, ప్రేమ, టెర్రరిజం ఇలా మూడు అంశాలను ఒక ఫార్ములా కథకు కలిపి చెప్పడం బాగా ఆకట్టుకునే అంశం. ఇక సెకండాఫ్ లోనే అసలైన కథ మొదలవడంతో సినిమా ఆసక్తికలిగిస్తుంది. ప్రీ క్లైమాక్స్ నుంచీ చివరి ముప్పయి నిముషాలు ఈ సినిమా బాగా ఆకట్టుకుంటుంది.

మైనస్ పాయింట్స్ :

సెకండాఫ్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకునే స్థాయిలో లేవు. హీరో, హీరోయిన్ల చిన్నప్పటి లవ్ ట్రాక్ ఎటువంటి ఎమోషన్ కలిగించకపోవడంతో పాటు విసిగిస్తుంది కూడా. ఆలీ పాత్రలో చేసిన కామెడీ ఏమాత్రం ఆకట్టుకోదు. రవి కిషన్ లౌడ్ యాక్టింగ్‍తో విసిగించాడు. అలాగే సెకండాఫ్ లో ఎంటర్టైన్మెంట్ తగ్గడంతో పాటు సినిమాని అక్కడక్కడా సాగదీశారు. ఇక ఈ సినిమాకు మైనస్ పాయింట్ ఏమిటంటే దర్శకుడు కొత్త థ్రిల్లర్ లైన్ అనుకున్నా, రెగ్యులర్ ఫార్ములా లాగా ప్రేమకథ చుట్టూనే ఎక్కువసేపు కథను నడపడం.

అలాగే కథాంశం బలమైనదే అయినా కొత్తది కాదు. అంతేకాకుండా కథ విషయంలో ఎప్పుడూ కొత్తదనం కోరుకునేవారికి, రెగ్యులర్ కథలను పెద్దగా ఇష్టపడని వారికి కూడా ఈ కథలో తాము కోరుకునే అంశాలు తక్కువ. అంతేకాకుండా ఈ సినిమాలో కామెడీ లేకపోవడం, ఉన్న కామెడీ కూడా పండకపోవడం ఈ సినిమాకి మైనస్ గా మారింది. ఇక ఈ సినిమాలో చాలా చోట్ల లాజిక్ ని పూర్తిగా వదిలేసారు. టైటిల్ కూడా తప్పుదారిపట్టించేలా ఉండటం మరో పెద్ద మైనస్ అని చెప్పవచ్చు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. ముందుగా నూతన దర్శకుడు రాజసింహ తాడినాడ ఓ వైవిధ్యమైన కథనే రాసుకుని స్నేహం, ప్రేమ, టెర్రరిజం చుట్టూ నడిపించే ప్రయత్నం చేశారు. కానీ పూర్తి స్థాయిలో సఫలం కాలేకపోయాడు. కథ సింపుల్ పాయింట్ కావడంతో స్క్రీన్ ప్లే చాలా తెలివిగా, ఆసక్తికలిగించే విధంగా రాసుకోవాల్సింది. ప్రధమార్థంలో విసిగించిన దర్శకుడు ద్వితీయార్థంలో మాత్రం ఫర్వాలేదనిపిస్తాడు. ప్రీ క్లైమాక్స్‌కి వచ్చేసరికి మాత్రం రచయితగా, దర్శకుడిగా రాజసింహ మంచి ప్రతిభ చూపాడు.

సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సినిమాలో ప్రతి ఫ్రేం చూడటానికి చాలా కలర్ఫుల్ గా ఉండేలా సీనియర్ సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు జాగ్రత్తలు తీసుకున్నాడు. ’ఎగిరెనే ఎగిరెనే…’ పాటలో వచ్చే విజువల్స్ ఆకట్టుకుంటాయి. అంతేకాకుండా రాత్రి ఎఫెక్ట్ లో తీసిన సన్నివేశాలకు ఇచ్చిన లైటింగ్ బావుంది. గ్రాఫిక్స్ కొద్దిచోట్ల ఫరవాలేదనిపించినా ఎక్కువగా తేలిపోయాయి. మిక్కీ జే మేయర్ అందించిన పాటలు బాగున్నాయి. కథకు తగ్గట్టుగా మంచి నేపథ్య సంగీతం అందించాడు. ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి.

ADD

తీర్పు :

మొదట్నుంచీ ప్రచారం పొందినట్లుగానే ‘ఒక్క అమ్మాయి తప్ప’ సినిమాకు ఉన్నంతలో కథే బలం. అయితే ఆ కథను పూర్తి స్థాయి సినిమాగా మలచడంలో తప్పటడుగులు వేయడంతో ఈ సినిమా మంచి థ్రిల్లర్‌గా నిలవలేకపోయింది. సందీప్ కిషన్, నిత్యా మీనన్‌ల నటన, కొత్తగా కనిపించే కథ, సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు పనితనం, ఫర్వాలేదనిపించే క్లైమాక్స్ లాంటి అనుకూలాంశాలతో వచ్చిన ఈ సినిమాలో కథనం బాగోలేకపోవడం, ప్రేక్షకుడిని కట్టిపడేసే సన్నివేశాలు ఎక్కడా లేకపోవడం, ఎంటర్‌టైనింగ్ అంశాలు కూడా లేకపోవడం లాంటివి ప్రతికూలాంశాలు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఎటువంటి అంచనాలు లేకుండా, కొత్త ప్రయత్నమేదో చేస్తే చూద్దామనుకునే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది.
                                                                                                                                 ---రివ్యూ బై విజ్ఞాన్ దాసరి
మరింత సమాచారం కోసం
LIKE, FOLLOW & SUBSCRIBE us

YOUTUBE                                FACEBOOK                        GOOGLE+                      TWITTER

రైట్ రైట్ సినిమా రివ్యు || Right Right Movie Review

రైట్ రైట్ సినిమా రివ్యు

Rating: 2.75/5
‘అంతకుముందు ఆ తరువాత’, ‘లవర్స్’, ‘కేరింత’ సినిమాలతో మంచి విజయాలను అందుకున్న హీరో సుమంత్ అశ్విన్, తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునే దిశగా అడుగులేస్తున్నారు. తాజాగా ఆయన హీరోగా నటించగా, కాళకేయ ప్రభాకర్ మరో ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘రైట్ రైట్’. మను దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మళయాలంలో మంచి విజయం సాధించిన ‘ఆర్డినరీ’ అనే సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన ‘రైట్ రైట్’, ఎంతమేరకు ఆకట్టుకుందీ? చూద్దాం...

కథ :
రవి (సుమంత్ అశ్విన్) ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, పెరిగిన యువకుడు. కుటుంబ బాధ్యతలన్నీ తనే మోయాల్సిన పరిస్థితుల్లో, రవి, పెద్దగా ఇష్టం లేకున్నా ఆర్టీసీలో బస్ కండక్టర్‌గా ఉద్యోగంలో చేరతాడు. ఎస్. కోట నుంచి గవిటి అనే ఓ చిన్న ఊరికి వెళ్ళే ఒకే ఒక్క బస్సుకి రవి, డ్రైవర్ శేషు (ప్రభాకర్) విధులు నిర్వహిస్తుంటారు. గవిటి ఊర్లో వీరిద్దరికీ అందరి దగ్గర్నుంచీ మంచి ఆదరణ ఉంటుంది. రవి ఆ ఊరి వాళ్ళతో, శేషుతో బాగా కలిసిపోతాడు. అంతా బాగున్న ఈ క్రమంలోనే రవి, శేషుల వల్ల ఓ ప్రమాదం జరుగుతుంది.

ఆ ప్రమాదంతో వారి జీవితాలు అనుకోని మలుపులు తిరుగుతాయి. రవి, శేషుల వల్ల జరిగిన ప్రమాదం ఏంటీ? తను ప్రేమించిన అమ్మాయి కళ్యాణి (పూజా జవేరి) రవికి దక్కుతుందా? ఒక్కసారే వచ్చిపడ్డ ఈ కష్టాలను రవి ఎలా ఎదుర్కున్నాడూ? లాంటి ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.

ప్లస్ పాయింట్స్ :
‘రైట్ రైట్’కు మేజర్ ప్లస్ పాయింట్ అంటే.. సినిమాలో వచ్చే ప్రధాన పాత్రలన్నింటికీ కథతో ఏదో ఒక విధంగా ఓ కనెక్షన్ ఉండడం, ఈ పాత్రలన్నీ కథా గమనానికి బాగా ఉపయోగపడడం గురించే చెప్పుకోవాలి. సుమంత్ అశ్విన్, ప్రభాకర్, పావని, నాజర్, భద్ర.. ఇలా ప్రధాన పాత్రలన్నింటికీ ఓ కథ ఉండటంతో పాటు అవన్నీ అసలు కథకు కనెక్ట్ అయి ఉన్న విధానం కూడా చాలా బాగుంది. ఇక సుమంత్-ప్రభాకర్‌ల మధ్యన వచ్చే సన్నివేశాలు సరదాగా బాగున్నాయి. ఇంటర్వెల్ బ్లాక్ సినిమాకు ఓ హైలైట్‌గా చెప్పుకోవాలి. సినిమా అసలు కథలోకి వెళ్ళే నేపథ్యం నుంచి వచ్చే ఈ ట్విస్ట్, మేకింగ్ పరంగానూ బాగుంది.

ఇక సుమంత్ అశ్విన్ తనకు అలవాటైన పాత్రే చేసినా, ఆ పాత్రలో చాలా బాగా నటించాడు. పాత్ర పరిధులు దాటకుండా సుమంత్ తన శక్తిమేర బాగా చేశాడు. ఇక ప్రభాకర్ తన కెరీర్లో ఇలాంటి పాత్రల్లో చాలా తక్కువగా కనిపించాడు. పూర్తిగా నెగటివ్ పాత్రలనే చేయగలడన్న పేరేదైనా ప్రభాకర్‌పై ఉంటే ఈ సినిమాతో దాన్ని పోగొట్టేలా చేశాడు. తన పాత్రతో అందరూ కనెక్ట్ అయ్యేలా ప్రభాకర్ బాగా నటించాడు. ఇక నాజర్ ఎప్పట్లానే తన స్థాయికి తగ్గ నటనతో మెప్పించారు. పావని గంగిరెడ్డి తన పాత్రలో ఒదిగిపోయింది. ఇక హీరోయిన్‌గా పూజా జవేరికి చెప్పుకోదగ్గ సన్నివేశాలేవీ లేకపోయినా, ఉన్నంతలో బాగా చేసింది. భద్ర అనే పాత్రలో నటించిన వినోద్ కిషన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకోదగ్గ రీతిలో నటించాడు.

సినిమా పరంగా చూసుకుంటే సెకండాఫ్‌ని ఈ సినిమాకు హైలైట్‌గా చెప్పుకోవచ్చు. అసలు కథతో పాటు, ట్విస్ట్‌లన్నీ ఈ భాగంలోనే ఉండడంతో సెకండాఫ్ క్లైమాక్స్‌కు ముందు వరకూ బాగా ఆకట్టుకుంది.

మైనస్ పాయింట్స్ :
ఈ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ అంటే, అసలు కథతో పాటు చుట్టూ ఉండే పరిస్థితులు, ఆలోచనలు.. అన్నీ 80,90వ దశకంలో వచ్చిన సినిమాలను తలపించడం గురించే చెప్పుకోవాలి. కథేమో నేటితరంలో నడుస్తూ, చుట్టూ ఉన్న పరిస్థితులు, ఆలోచనలేమో పాతతరంలా కనిపిస్తూ రెండింటికీ కనెక్షన్ కుదరక సినిమా అసహజంగా కనిపిస్తుంది. ఇక సెకండాఫ్ మొదలయ్యే వరకూ అసలు కథలోకి తీసుకెళ్ళకుండా, అప్పటివరకూ కట్టిపడేసే సన్నివేశాలేవీ పెట్టకుండా ఫస్టాఫ్ మొత్తం కాలక్షేపంలా గడిపేయ్యడం ఆకట్టుకోలేదు.

అదేవిధంగా సెకండాఫ్‌లో ట్విస్ట్‌లతో ఆకట్టుకున్నా, క్లైమాక్స్ దగ్గరకు వచ్చేసరికి సినిమా పూర్తిగా మెలోడ్రామాగా మారిపోయింది. ఈ సన్నివేశాల్లో భావోద్వేగం కనెక్ట్ అవ్వకపోగా, కాస్త అతిగా కూడా కనిపించింది. ఇక ఒక మిస్టరీ చుట్టూ తిరిగే సెకండాఫ్‍లో ఆ మిస్టరీ వెనుక ఉన్న కారణం కూడా మరీ బలమైనది కాకపోవడం కూడా మైనస్సే!

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల పరంగా చూస్తే, ‘రైట్ రైట్’ ఓ చిన్న సినిమా అన్న ఆలోచన తెప్పించదు. ముఖ్యంగా శేఖర్ వి జోసఫ్ సినిమాటోగ్రఫీ గురించి ఎంత చెప్పినా తక్కువే! సినిమా మూడ్‌ను ఎక్కడా దారితప్పించకుండా, లొకేషన్స్‌ని సరిగ్గా వాడుకుంటూ ఓ మంచి ఫీల్ తెచ్చారు. ఇంటర్వెల్ బ్లాక్‌ని శేఖర్ పనితనానికి ఓ నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇక జేబీ అందించిన మ్యూజిక్ ఫర్వాలేదు. సందర్భానుసారంగా వచ్చే పాటలన్నీ విజువల్స్‌తో కలిపి చూసినప్పుడు బాగున్నాయి. ఉద్ధవ్ ఎడిటింగ్ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు.

ADD



ఇక ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన మను పూర్తి స్థాయిలో ప్రతిభ చూపడంలో విఫలమయ్యాడనే చెప్పుకోవాలి. మళయాలంలో ఆకట్టుకున్న కథను, ఇక్కడి నేపథ్యానికి తగ్గట్టుగా బాగానే మార్చుకున్నా, ఆ కథను పాతతరం పరిస్థితులు, ఆలోచనల చుట్టూ చెప్పడమే మను చేసిన తప్పుగా కనిపిస్తుంది. దర్శకుడిగా మాత్రం కొన్నిచోట్ల మను మంచి ప్రతిభే చూపాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్, ప్రీ క్లైమాక్స్‌లో ట్విస్ట్ బయటపడే విధానం.. ఇలాంటి సన్నివేశాల్లో మను మేకింగ్ పరంగా ఫర్వాలేదనిపించాడు.

తీర్పు :

తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం ఉన్న హీరోలు, సినిమాలు, వాటి బాక్సాఫీస్ పరిస్థితులు.. ఇవన్నీ చూసినతర్వాత కొత్తగా ఒక హీరో తనదైన గుర్తింపు తెచ్చుకోవాలంటే ఎప్పటికప్పుడు కొత్తగా ఏదోకటి ప్రయత్నిస్తూనే ఉండాలి. హీరోగా ఇప్పుడిప్పుడే ఎదుగుతోన్న సుమంత్ అశ్విన్ కూడా ఈ క్రమంలోనే తనకున్న ఇమేజ్‌ను పక్కనబెట్టి ఓ సాదాసీదా పాత్రలో కనిపిస్తూ, ‘రైట్ రైట్’ అనే సినిమాతో మనముందుకు వచ్చాడు. ‘రైట్ రైట్’ అసలు కథ ఎప్పుడు చెప్పినా బాగుండేదే! అయితే ఆ కథను చెప్పిన విధానంలోనే ఈ సినిమా తడబడింది. సుమంత్ అశ్విన్, ప్రభాకర్, నాజర్, పావని తదితరుల పాత్రలూ, ఆ పాత్రల్లో వారి నటన, మేకింగ్ పరంగా ఆకట్టుకునే ఇంటర్వెల్, సెకండాఫ్‌లో వచ్చే కొన్ని ట్విస్ట్స్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. ఇకపోతే పైనే చెప్పినట్టు, కథ పాతతరం ఆలోచనల చుట్టూ తిరగడం, అతిగా కనిపించే క్లైమాక్స్, ఫస్టాఫ్‌లో పెద్దగా కట్టిపడేసే స్థాయి సన్నివేశాలేవీ లేకపోవడం ఈ సినిమాకు మైనస్ పాయింట్స్. ఒక్కమాటలో చెప్పాలంటే.. మెలోడ్రామా ఎక్కువై ‘రైట్ రైట్’ కాస్త పక్కదారి పట్టింది!!

                                                                                                                    ---రివ్యూ బై విజ్ఞాన్ దాసరి

మరింత సమాచారం కోసం
LIKE, FOLLOW & SUBSCRIBE us

YOUTUBE                                FACEBOOK                        GOOGLE+                      TWITTER

Saturday 4 June 2016

ఆడియో వేదికపై యాంకర్ ఝాన్సిని ఘోరంగా అవమానించిన దాసరి, మంత్రి రసమై బాలక్రిష్ణ...

ఆడియో వేదికపై యాంకర్ ఝాన్సిని ఘోరంగా అవమానించిన దాసరి, మంత్రి రసమై బాలక్రిష్ణ...

యాంకర్ ఝాన్సిని ఘోరంగా అవమానించిన దాసరి, మంత్రి రసమై బాలక్రిష్ణ...

మంత్రి రసమై బాలక్రిష్ణ ఆడియో వేదిక మీద, అదీ దాసరి, సి.కళ్యాణ్, భీమనేని లాంటి వాళ్ల ముందు, యాంకర్ ఝాన్సి గురించి అసభ్యంగా మాట్లాడారు. "అమ్మా నిన్ను నేను చిన్నపటినుండి చూస్తున్న,  నా ఆరొ తరగతి నుండి అలానే ఉన్నావు" అని అన్నారు.

ఇక దాసరి గారు ఆడియొ వేదికపై, సినిమా ప్రచారాలపై గురించి దుమ్ము దులిపేసారు. "ట్రైలర్స్, ఆడియొ ఫంక్షన్స్ చేసి సినిమా మీద ఇంట్రస్ట్ పాడుచెయకండి. రిలీజ్ కి ముందు ట్రైలర్స్ లో సినేమా మొత్తం చూపిస్తూ, ట్విస్టులు చూపించేస్తూ ఇంట్రస్ట్ తగ్గించేస్తున్నారు. మారొజుల్లొ హీరో, హీరొయిన్ల పోస్టర్లు తప్ప, థియేటర్ కి వచ్చేవరకు ఏమీ తెలిసేది కాదు. అందుకె జనాలు థియేటర్ కి వచేవాళ్ళు, నాలుగు డబ్బులు వచేవి. ఇప్పుడు చిన్న సినిమాలు అందుకే సక్సస్ కాలేకపొతున్నాయి".

ADD



మరింత సమాచారం కోసం
LIKE, FOLLOW & SUBSCRIBE us

Facebook          Twitter          YouTube          Blog          Google+

శ్రీ శ్రీ సినిమా రివ్యు | Sri Sri movie review



‘శ్రీ శ్రీ’ సినిమా రివ్యు

26Pictures Rating: 3.5/5

‘సూపర్‌స్టార్’ కృష్ణ.. తెలుగు సినీ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా ఇలా చేపట్టిన అన్ని బాధ్యతలనూ సమర్ధవంతంగా నిర్వహించి తనకంటూ ఒక గొప్ప గుర్తింపు తెచ్చుకున్న కృష్ణ వారసత్వం ఈతరం సూపర్ స్టార్‌గా అవతరించిన మహేష్ ద్వారా కొనసాగుతూనే ఉంది. కొద్దికాలంగా నటనకు దూరంగా ఉంటూ వచ్చిన కృష్ణ, మళ్ళీ ఇన్నాళ్ళకు తన అభిమానులను అలరించేందుకు ‘శ్రీ శ్రీ’ అనే సినిమాతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. గతంలో ‘సంక్రాంతి’, ‘రాజా’ లాంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు ముప్పలనేని శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. పగ తీర్చుకోవడం అనే కాన్సెప్ట్ ఎప్పటికీ పాతది కాదు అన్న ట్యాగ్‌తో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందీ? చూద్దాం…

కథ :

శ్రీ శ్రీ (కృష్ణ) తన భార్య(విజయ నిర్మల) కూతురు శ్వేతలతో సంతోషకరమైన జీవితం గడిపే ఓ ప్రొఫెసర్. ఓ ప్రముఖ న్యూస్ చానల్‌లో జర్నలిస్ట్‌గా పనిచేసే శ్వేతకు భిక్షపతి (పోసాని కృష్ణమురళి), జేకే (మురళి శర్మ) అనే ఇద్దరు క్రిమినల్స్ చేసే ఓ భారీ స్కామ్ గురించి తెలుస్తుంది. ఈ విషయం గురించే పోలీసులకు తెలియజేయాలనుకుంటుండగా భిక్షపతి, జేకే మనుషులు శ్వేతను హతమరుస్తారు.

దీంతో కూతురు చావుకి కారణమైన వారిని శిక్షించాలంటూ శ్రీ శ్రీ చేసే న్యాయ పోరాటం వృథా అవుతుంది. నిస్సహాయ స్థితిలో తానే వారిని శిక్షించాలనుకున్న శ్రీ శ్రీ వారిని ఏం చేశాడూ? వారిపై ఎలా పగ తీర్చుకున్నాడూ? అన్నది మిగతా సినిమా.

ప్లస్ పాయింట్స్ :

సూపర్ స్టార్ కృష్ణ రోల్ ఈ సినిమాకు అన్నింటికీ మించి మేజర్ హైలైట్‌గా చెప్పుకోవచ్చు. ఆ పాత్రలో ఆయన చక్కగా ఒదిగిపోయి కనిపించారు. తన స్థాయికి తగ్గ నటనతో ఆయన హుందాగా నటించారు. ఇక ఈ వయసులోనూ ఒక ప్రధాన పాత్రలో నటించడంలో ఆయన చూపిన ఉత్సాహానికి అభినందించాల్సిందే! ముఖ్యంగా ఓ నిస్సహాయ ప్రొఫెసర్ పగ తీర్చుకోవడం ఎలా ఉంటుందో అన్న నేపథ్యం నుంచి పుట్టే సన్నివేశాలు బాగున్నాయి. ఇక కృష్ణ స్టార్‌డమ్‌ని దృష్టిలో పెట్టుకొని అనవసర ఆర్భాటాలు చేయకుండా, పగ తీర్చుకోవడం కూడా ఎక్కడా ఓవర్ చేయకుండా ఉండడాన్ని ప్లస్ పాయింట్‌గానే చెప్పుకోవాలి.

నరేష్ ఓ మర్డర్ మిస్టరీని చేజ్ చేయడంలో కీలక పాత్ర పోషించి మెప్పించారు. ఇక విజయ నిర్మల కూడా తన పాత్రకు న్యాయం చేశారు. కృష్ణ కూతురుగా నటించిన నటి చాలా బాగా చేసింది. మురళీ శర్మ, పోసాని తదితరులు తమ పాత్ర పరిధిమేర బాగానే నటించారు. ఇక సినిమా పరంగా ఫస్టాఫ్ రివెంజ్ బ్యాక్‌డ్రాప్‌తో బాగా ఆకట్టుకుంది.

మైనస్ పాయింట్స్ :

ఓ ఆకట్టుకునే ఫస్టాఫ్ తర్వాత సెకండాఫ్ దాదాపుగా నెమ్మదిగా, పెద్దగా కట్టిపడేసే సన్నివేశాలేమీ లేకుండా సాగుతుండడాన్నే మేజర్ మైనస్‌గా చెప్పుకోవాలి. ఈ పార్ట్‌లో ఫ్లాష్‌బ్యాక్ నేపథ్యాన్ని రెండు మూడు సార్లు చూపించడం కూడా బాగోలేదు. అదేవిధంగా ఇలాంటి కథల్ని ఇప్పటికే మనం చాలా చూసి ఉండడంతో కథ పరంగా కొత్తదనం ఆశించడానికి ఏమీ లేదు. ఇక కథనంలోనూ చివరికి ఏమైపోతుందో కూడా ముందే తెలిసిపోవడం ఈ సినిమా విషయంలో మరో మైనస్‌గా చెప్పుకోవాలి.

సెకండాఫ్‌లో నరేష్ క్యారెక్టర్‌ని కూడా సరిగ్గా డిజైన్ చేసినట్లు కనిపించదు. కొన్నిచోట్ల తక్కువ డీటైలింగ్ ఇవ్వడంతో కథలో క్లారిటీ లోపించినట్లు కనిపించింది. లాజిక్‌ని కూడా పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. కొన్ని కొన్ని చోట్ల ఈ సినిమా పాతతరం సినిమాల్ని చూస్తున్న ఫీలింగ్ కల్పించి బోర్ కొట్టిస్తుంది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల పరంగా చూస్తే, ముందుగా ఈ సినిమాను ఎక్కడా క్వాలిటీ పరంగా రాజీ పడకుండా, మంచి ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో నిర్మించిన విధానాన్ని మెచ్చుకోవాలి. కెమెరా వర్క్ చాలా బాగుంది. ముఖ్యంగా రివెంజ్ తీర్చుకునే నేపథ్యంలో వచ్చే సన్నివేశాలను చాలా బాగా క్యాప్చర్ చేశారు. ఎడిటింగ్ బాగుంది. డైలాగ్స్ కూడా కథకు తగ్గట్టుగా బాగున్నాయి.

దర్శకుడు ముప్పలనేని శివ విషయానికి వస్తే, ఫస్టాఫ్ వరకూ మంచి స్క్రీన్‌ప్లే రాసుకున్న ఆయన, సెకండాఫ్ విషయంలో మాత్రం రచయితగా పూర్తి స్థాయిలో రాణించలేకపోయారు. ఇక దర్శకుడిగానూ ఈ సినిమాలో ఆయన తన స్థాయికి తగ్గ ప్రతిభ చూపలేదు. అక్కడక్కడా ఫర్వాలేదనిపించినా, ఓవరాల్‌గా ఓ సినిమాను మనకు బోర్ కొట్టకుండా అందించే ప్రయత్నంలో మాత్రం పూర్తి స్థాయిలో అలరించలేకపోయారు.

తీర్పు :

సూపర్ స్టార్ కృష్ణ వెండితెరపై కనిపించి చాలాకాలమే అయింది. సినీ పరిశ్రమలో 50 వసంతాలు పూర్తి చేసుకున్న కృష్ణ రీ ఎంట్రీ సినిమాగా ప్రచారం తెచ్చుకున్న ‘శ్రీ శ్రీ’, ఆయన అభిమానులను అలరించేలానే ఉందని చెప్పొచ్చు. ఒక మంచి పాత్రలో, తన స్థాయికి తగ్గ నటనతో కృష్ణ బాగా మెప్పించడం, ఫస్టాఫ్‌లో వచ్చే సన్నివేశాలన్నీ ఆకట్టుకునేలానే ఉండడం ఈ సినిమాకు కలిసి వచ్చే అంశాలు. ఇకపోతే పాతకథను, అదే పాత ఫార్మాట్‌లో చెప్పడం, సెకండాఫ్ ఆకట్టుకునే స్థాయిలో లేకపోవడం లాంటివి ఈ సినిమాకు మైనస్. ఒక్కమాటలో చెప్పాలంటే.. సూపర్ స్టార్ కృష్ణ వెండితెరపై కనిపిస్తే చూడాలని ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ సినిమా బాగానే నచ్చుతుంది.

ADD



మరింత సమాచారం కోసం
LIKE, FOLLOW & SUBSCRIBE us

Facebook          Twitter          YouTube          Blog          Google+

అ..ఆ... సినిమా రివ్యు | A AA Movie Review


అ..ఆ...  సినిమా రివ్యు


26PICTURES RATING: 3.75/5
తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడు త్రివిక్రమ్ సినిమా వస్తోందంటే దానిపై సినీ అభిమానుల్లో మంచి ఆసక్తి కనిపిస్తూంటుంది. తాజాగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘అ..ఆ..’ కూడా మొదట్నుంచీ మంచి క్రేజ్ తెచ్చుకుంది. నితిన్, సమంత హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఆ అంచనాలను అందుకునే స్థాయిలోనే ఉందా? చూద్దాం..

కథ :

అనసూయ రామలింగం (సమంత) ఓ సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగిన యువతి. తన తల్లి మహాలక్ష్మి (నదియా) ఇష్టం మేరకే అందరూ నడుచుకోవాల్సి రావడం అనసూయకు నచ్చదు. ఈ క్రమంలోనే ఓ సారి తండ్రి రామ లింగం (నరేష్) సలహా మేరకు, కొన్ని రోజులు ప్రశాంతంగా గడపాలని తన అత్త ఇంటికి వెళుతుంది. అక్కడే అనసూయకు బావ ఆనంద్ విహారి (నితిన్) పరిచయమవుతాడు. కొద్దిరోజుల్లోనే అనసూయ ఆనంద్ విహారికి దగ్గరవుతుంది.

కాగా ఆనంద్ విహారికి కుటుంబం మాత్రం కొన్ని ఇబ్బందుల్లో ఉంటుంది. ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఆనంద్, పల్లం వెంకన్న (రావు రమేష్) కూతురు నాగవల్లి (అనుపమ)తో పెళ్ళికి ఒప్పుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా అనసూయ తల్లి మహాలక్ష్మికి, ఆనంద్ కుటుంబానికి ఏళ్ళుగా వైరం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో వీరి ప్రేమ ఏమైంది అన్నది సినిమా.

ప్లస్ పాయింట్స్ :

సున్నితమైన భావోద్వేగాలను, ప్రేమకథల్లో ఉండే కన్ఫ్యూజన్‍ను చాలా తెలివిగా చెప్పడంలో త్రివిక్రమ్ చూపిన ప్రతిభనే ఈ సినిమాకు అన్ని విధాలా ప్రధాన అనుకూలాంశంగా చెప్పుకోవాలి. ఒక పూర్తి స్థాయి ప్రేమకథలో, కుటుంబ బంధాలను కలిపి చెప్పడానికి ఏయే అంశాలు అవసరమో వాటన్నింటినీ త్రివిక్రమ్ పొందిగ్గా పొందుపర్చిన విధానం అబ్బురపరుస్తుంది. సినిమా పరంగా చూస్తే, ఈ సినిమా ఇంటర్వెల్, క్లైమాక్స్, ఆద్యంతం నవ్విస్తూనే, కదిలిస్తూనే సాగే సన్నివేశాల క్రమం వీటిని హైలైట్‍గా చెప్పుకోవచ్చు.
సమంత ఏ స్థాయి నటో ఈ సినిమా మరోసారి ఋజువు చేసేలా ఉంది. నితిన్, ఈ సినిమాతో కెరీర్ బెస్ట్ నటన ప్రదర్శించాడు. రావు రమేష్ తన నటనతో ఈ సినిమాను మరో ఎత్తుకు తీసుకెళ్ళాడనే చెప్పుకోవాలి. అనుపమ పరమేశ్వరన్ చూడముచ్చటగా ఉంది. స్క్రీన్‍పై అనుపమ కనిపించినప్పుడల్లా కళ్ళుతిప్పుకోనివ్వనంత అందంగా, తెలివిగా నటించింది.

మైనస్ పాయింట్స్ :

అ..ఆ..’ లో మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే కొన్ని చోట్ల సినిమా చాలా నెమ్మదిగా సాగడం గురించే మొదట చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు కనిపించాయి. త్రివిక్రమ్ సినిమాలన్నింటిలానే ఇందులోనూ యాక్షన్ ఎపిసోడ్స్ అక్కడక్కడా కథ స్థాయికి మించి, అసహజంగా కనిపించాయి. అలాగే సినిమా కూడా చాలా నెమ్మదిగా మొదలై అంతే నెమ్మదిగా మొదటి పది నిమిషాలు సాగుతుంది.
ఇక పూర్తిగా ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్‍స్టోరీలోని కన్ఫ్యూజన్‍ చుట్టూనే తిరిగే ఈ సినిమా, మాస్ అంశాలను, హై లెవెల్ హీరోయిజాన్ని కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా పెద్దగా కనెక్ట్ కాకపోవచ్చు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల పరంగా చూస్తే, ‘అ..ఆ..’ అన్ని విషయాల్లో పూర్తి స్థాయిలో ఆకట్టుకుందనే చెప్పాలి. తాను చెప్పాలనుకున్న అంశాన్నే తెలివిగా, తాను బాగా అర్థం చేసుకున్న పద్ధతిలోనే అందరికీ అర్థమయ్యేలా చెప్పడంలో దర్శకుడు త్రివిక్రమ్ చూపిన ప్రతిభ అద్భుతమనే చెప్పాలి. త్రివిక్రమ్ సినిమాల్లో ఎక్కువగా రచయిత దర్శకుడిపై పైచేయి సాధించడం చూస్తూంటాం. ఈ సినిమాలోనూ అదే కనిపిస్తుంది. లోతైన సంభాషణలను అందరికీ అర్థమయ్యేలా చెప్పడంలో త్రివిక్రమ్ ఎప్పటికప్పుడు చూపే నేర్పు సినిమా చూస్తున్నంత సేపూ ముచ్చటగొలిపేలా ఉంది. దర్శకుడిగానూ త్రివిక్రమ్ కొన్నిచోట్ల తన ప్రతిభను చూపారు.

ఇక మిక్కీ జే మేయర్ అందించిన పాటలన్నీ వినసొంపుగా ఉండడంతో పాటు సాహిత్యం పరంగానూ అద్భుతంగా ఉన్నాయి. ఇక ఆయా పాటలు సినిమాలో వచ్చే సందర్భాలు, నేపథ్యాలు కూడా బాగున్నాయి. నటరాజన్ సుబ్రమణ్యం సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ఓ స్థాయిని తెచ్చిపెట్టేంత అందంగా ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. విజువల్స్‌లో డీటైలింగ్‌ను ఎక్కువ చూపించే త్రివిక్రమ్‌తో కలిసి నటరాజన్ చాలాచోట్ల మ్యాజిక్ చేశారు. ఇక కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటింగ్ బాగుంది. ఆర్ట్ వర్క్ బాగుంది. ఎస్.రాధాకృష్ణ నిర్మాణ విలువలకు ఎక్కడా వంక పెట్టలేం.

తీర్పు :

త్రివిక్రమ్ సినిమాల్లో అందమైన భావోద్వేగాలుంటాయి. ప్రేమలు, బంధాలు, అలకలు, అసూయలు అన్నీ కలిపిన మనుషులు.. ఇవన్నీ ఉంటాయి. వీటి చుట్టూ తిరిగే కథల గురించి చెప్పినప్పుడల్లా త్రివిక్రమ్‍లోని రచయిత ఎప్పటికప్పుడు కొత్తగా బయటకు వస్తుంటాడు. అ..ఆ..లోనూ త్రివిక్రమ్ ఎప్పుడూ చేసే ఆ మ్యాజిక్ ఉంది. బంధాల్లో గీసుకున్న గీతలు, ప్రేమలోని కన్ఫ్యూజన్ చుట్టూ త్రివిక్రమ్ చెప్పిన ఈ ప్రేమకథ, చెప్పాలనుకున్న విషయాన్ని పొందిగ్గా, అందంగా అల్లిన సన్నివేశాలతో కట్టిపడేసే స్థాయిలోనే ఉందని చెప్పొచ్చు. సమంత, నితిన్, రావురమేష్‍ల నటన, త్రివిక్రమ్ రచన, ప్రాక్టికల్‍గా కనిపించే క్లైమాక్స్.. లాంటి ప్లస్‍లతో వచ్చిన ఈ సినిమాలో సెకండాఫ్‍ కాస్త నెమ్మదించడం అన్నది ఒక్కటే చెప్పుకోదగ్గ ప్రతికూలాంశం. ఒక్క మాటలో చెప్పాలంటే.. త్రివిక్రమ్ తన రచనతో అందంగా దిద్దిన ప్రేమకథే ’అ..ఆ..’!!

ADD



మరింత సమాచారం కోసం
LIKE, FOLLOW & SUBSCRIBE us
Facebook          Twitter          YouTube          Blog          Google+


Monday 30 May 2016

ప్రియమణి జీవితంలొ... ఒక యువరాజు


ప్రియమణి జీవితంలొ... ఒక యువరాజు

సౌత్ లో ఎందరో అభిమానులని సంపాదించిన ప్రియమని నిశ్చితార్ధం బెంగళూరులోని ఆమె ఇంటిలొ జరిగింది. చెన్నైకి చెందిన వ్యాపారవేత్త ముస్తఫారాజ్ తో చాలా కాలంగా ఆమె ప్రేమలొ ఉన్న సంగతి తెలిసిందే. శుక్రవారం తమ నిశ్చితార్ధం జరిగిన విషయాన్ని ప్రియమని ట్విట్టర్ ద్వార చెప్పింది..

AD


మరింత సమాచారం కోసం
LIKE, SHARE, FOLLOW, SUBSCRIBE us

FACEBOOK                                                    TWITTER                                              YOUTUBE           
 

Science

Comedy

Adventure

Copyright © 2013 26PICTURES తెలుగు
Design by FBTemplates | BTT
    Twitter Facebook Google Plus Vimeo YouTube